Income Tax: నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను కొత్త చట్టాలు ప్రకటించారు.. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు!
1961లో ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని 2025 జనవరి నాటికి సమీక్షించాలని నిర్ణయించారు. చీఫ్ కమిషనర్ వి.కే. గుప్తా నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ, పాతకాలం నాటి 120కు పైగా విభాగాలు, ఉపవిభాగాలు, క్లాజ్‌లను తొలగించనుంది. వీటిలో టెలికాం, ప్రత్యేక ఆర్థిక మండలాలు (SEZ), క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపులు ముఖ్యంగా ఉంటాయి.
రైతు భరోసా: అర్హత ఉన్న రైతులకు రూ. 15,000..తుమ్మల కీలక ప్రకటన!
ఈ మార్పులతో పాటు పాత క్లాజ్‌లకు ప్రత్యేక అనుబంధం కూడా ఉండొచ్చు. 2024 జూలై బడ్జెట్లో ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. పన్ను సరళీకరణ, ఖచ్చితత్వం, పన్ను దాతలకు మెరుగైన సేవలు, వివాదాలను తగ్గించే లక్ష్యాలతో ఈ మార్పులు రూపొందించబడుతున్నాయి. CBDT చైర్మన్ రవి అగర్వాల్ కూడా కొత్త చట్టానికి అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను పరిశీలిస్తున్నారని తెలిపారు.