Runa Mafi: రుణ మాఫీ కోసం రైతుల భారీ పోరాటం..ఈ రోజు చలో ప్రజా భవన్!
రుణ మాఫీ లభించని రైతులు ఈ రోజు “చలో ప్రజా భవన్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ హామీలు నెరవేరలేదని ఆగ్రహంతో, ఎలాంటి షరతులు లేకుండా రుణ మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టిన రైతులు, సోషల్ మీడియాలో ఒకతాటిపైకి వస్తున్నారు.
ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు రూ.2 లక్షల రుణ మాఫీ హామీ ఇచ్చినప్పటికీ, 70 లక్షల మంది కర్షకులలో కేవలం 42 లక్షల మందిని మాత్రమే అర్హులుగా ప్రకటించింది. ఇప్పటివరకు 23 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణం మాఫీ చేయబడింది. రైతులు తక్షణం ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.