SBI భారీ శుభవార్త.. బంపర్ ఆఫర్ ఇచ్చిన బ్యాంక్.. ఇంకా కొద్దిరోజులే..!
ఎస్‌బీఐ బంపర్ ఆఫర్: హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు 100% మినహాయింపు!
భారతదేశంలో అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ హోమ్ లోన్ పొందాలనుకునే కస్టమర్లకు శుభవార్త అందించింది. కోట్లాది మంది కస్టమర్లతో ఉన్న ఎస్‌బీఐ, హోమ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు 100% మినహాయింపును ప్రకటించింది.
ఇప్పుడు ఇల్లు కట్టడం లేదా కొనడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల, చాలా మంది హోమ్ లోన్లు తీసుకుంటారు. సాధారణంగా, బ్యాంకులు లోన్ మొత్తంపై 2% నుండి 5% వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. కానీ, ఎస్‌బీఐ తాజాగా తీసుకువచ్చిన ఈ ఆఫర్ ప్రకారం, ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మినహాయించడం వల్ల కస్టమర్లకు పెద్ద ఊరట కలిగిస్తుంది.
ఈ పరిమిత కాల ఆఫర్‌తో, ఎస్‌బీఐలో హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారు ప్రాసెసింగ్ ఫీజు లో మినహాయింపుతో ఇల్లు కలల్ని సాకారం చేసుకోవచ్చు!
Tags: SBI, SBI News Rules, SBI Loans